దోచుకోకుండా ఏమైనా మిగిల్చారా: జగన్‌ను ఏకేసిన లోకేష్

First Published 12, Jun 2018, 1:34 PM IST
Ap minister Nara Lokesh reacts on Ys Jagan comments
Highlights

జగన్ పై  లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

అమరావతి:రాష్ట్రంలో దోచుకోకుండా మీరు మిగిల్చింది ఏమైనా ఉందా అని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ వైఎస్ జగన్ పై    మంగళవారం నాడు  విమర్శలు కురిపించారు.

 

 ఏపీ రాష్ట్రంలో సహజ వనరులను దోచుకొంటున్నారని వైసీపీ చీఫ్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని లోకేష్ చెప్పారు.  బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కింద సహజ వనరులను, ఖనిజాలను, బాక్సైట్, లైమ్‌స్టోన్ ను తిన్నారని  లోకేష్ జగన్ పై విమర్శలు కురిపించారు. 

13 చార్జ్‌షీట్లలో మీరు దోచుకున్న మెనూ మొత్తం ఉందంటూ లోకేష్  దుయ్యబట్టారు. పాదయాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న సభల్లో సహజ వనరులను ఏపీ ప్రభుత్వం దోచుకొంటుందని  టిడిపి నేతలపై జగన్ చేసిన విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. 
 
 

loader