విజయవాడ: రాష్ట్ర అభివృద్ధిపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిసీఎం చంద్రబాబు నాయుడు అన్ని రాష్ట్రాల కంటే ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టేనని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో పంపారని గుర్తు చేశారు. 

రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని వివరించారు. అయినా రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోదీతో కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని నారా లోకేష్ ఆరోపించారు.