Asianet News TeluguAsianet News Telugu

సర్వేలపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

2014లో టీడీపీ ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పాయని కానీ గెలిచామని లోకేష్‌ గుర్తు చేశారు. కేంద్రమంత్రులే ఏపీ పని తీరు బాగుందని కితాబు ఇస్తున్నారని చెప్పుకుచ్చారు. బీజేపీ రాష్ట్ర నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని లోకేశ్ విమర్శించారు. 

ap minister nara lokesh comments on surveys
Author
Delhi, First Published Jan 30, 2019, 10:08 PM IST

ఢిల్లీ: టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి 23 పార్లమెంట్ స్థానాలు వస్తాయంటూ తప్పుడు సర్వేలు చెప్తున్నాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. 

2014లో టీడీపీ ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పాయని కానీ గెలిచామని లోకేష్‌ గుర్తు చేశారు. కేంద్రమంత్రులే ఏపీ పని తీరు బాగుందని కితాబు ఇస్తున్నారని చెప్పుకుచ్చారు. బీజేపీ రాష్ట్ర నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని లోకేశ్ విమర్శించారు. 

రాష్ట్రాభివృద్ధి కోసం పాలసీ ప్రకారమే భూముల కేటాయింపులు జరుగుతాయని, రూ.5 కోట్లకు ఎకరం ఇస్తే పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని లోకేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ‌కి భూమి కేటాయించినప్పుడు కూడా విమర్శించారని లోకేశ్ గుర్తు చేశారు.  
 
ఇకపోతే కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రి తోమర్‌ను లోకేశ్ కలిశారు. ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. మెటీరియల్, వేతనాల కింద కేంద్రం రూ.2138 కోట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రికి వివరించారు. 346 కరువు మండలాల్లో 150 రోజుల పనిదినాలకు కేంద్రం అనుమతించాలని తోమర్‌ను కోరినట్లు లోకేశ్ స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios