వైసిపి ఎంపీల రాజీనామాలు పెద్ద డ్రామా

గుంటూరు: రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయనికి నిరసనగా ఎన్డీయే నుంచి బయటకు రావడం జరిగిందన్నారు ఎపి మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నక్కా ఆనందబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన కామెంట్స్..

ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటనుంచి బీజేపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కుట్రపూరితత్వంతో వ్యవహరిస్తుంది. వైజాగ్ లో ధర్మపోరాట దీక్ష చేస్తే పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టుకొని హైదరాబాద్ లో అర్థరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ధర్మపోరాట దీక్షను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ధర్మపొరట దీక్ష చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి, వైసిపినాయకులు నయవంచన దీక్ష పేరు తో ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధి ని అడుగడుగునా అడ్డుకుంటున్న జగన్ ది నాయవంచన కాదా? 12 కేసుల్లో ఛార్జిసిట్ 16 నెలలు జైలులో ఉండి ఆర్టీకల్ 3ద్వారా రాష్ట్ర విభజన చేయమని కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకొని స్వార్థం కోసం బైయిల్ మీద వచ్చిన విధానం నయవంచన కాదా?మోదీ ని ఒక్కమాట కూడా అనలేని పిరికిపంద జగన్ మోహన్ రెడ్డి. వైసీపి యంపీలు రాజీనామాలు ఆమోదించకపోవడం నయవంచన కాదా. వైసీపి యంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికల్లో ఓడిపోతారని భయపడుతున్నారు.

జగన్ పాదయాత్రలు, వంచన యాత్రలు ప్రజలు గమనిస్తున్నారు. జగన్ పవన్ ను విమర్శించడు, పవన్ జగన్ ను విమర్శించడు. కన్నా లక్మీనారాయణ చంద్రబాబుపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అవినీతి అంటున్నారు ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయాడు. చిన్నతనం నుంచి కాంగ్రెస్ లో చేసిన కన్నాకు ఒక్క రాత్రికే బిజెపి సిద్దాంతాలు నచ్చాయా? రాత్రికి రాత్రి పార్టీ మారి విలువలు లేకుండా మాట్లాడితే తగిన బుధ్ది చెప్తాం.