ఆఖరికి పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులను బెదిరించేందుకే వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రైతును చంపే అవసరం తమ ప్రభుత్వానికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడటం అలవాటుగా చేసుకుందని ఆరోపించారు. రైతు కోటయ్య మృతిపై ఆరోపణలు చేస్తూ వైసీపీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

ఆఖరికి పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులను బెదిరించేందుకే వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రైతును చంపే అవసరం తమ ప్రభుత్వానికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. 

తమపై, ప్రభుత్వంపై కుట్రలు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటుతో గట్టి దెబ్బ కొడతారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.