సినీ నటులు, నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఏపీ మంత్రి లోకేష్ థ్యాంక్స్ చెప్పారు.


సినీ నటులు, నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఏపీ మంత్రి లోకేష్ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే.. ఇటీవల ఏపీలో తెత్లీ తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ తుపాన్ దాటికి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. కాగా.. వారిని ఆదుకునేందుకు మేమున్నామంటూ కొందరు తెలుగు సినీ హీరోలు ముందుకువచ్చారు.

Scroll to load tweet…

ఎన్టీఆర్ రూ.15లక్షలు, కళ్యాణ్ రామ్ రూ.5లక్షలు, అదేవిధంగా విజయ్ దేవరకొండ, మంచు మనోజ్, మెగా హీరో వరుణ్ తేజ్ వీరంతా తమ వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా తమ అభిమానులు కూడా ఉత్తరాంధ్రకు సహాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు.

Scroll to load tweet…

ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు వీరంతా ముందుకు రావడాన్ని మంత్రి లోకేష్ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ.. ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెప్పారు.