లోకేష్‌పై నమ్మకం లేకే పవన్ వైపు: చంద్రబాబుపై కొడాలి ఫైర్
లోకేష్ పై చంద్రబాబుకు నమ్మకం లేనందున తన పార్టీని గట్టెక్కించేందుకు దత్తపుత్రుడు పవన్ వైపు చూస్తున్నాడని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.
అమరావతి: లోకేష్ పై చంద్రబాబుకు నమ్మకం లేనందున తన పార్టీని గట్టెక్కించేందుకు దత్తపుత్రుడు పవన్ వైపు చూస్తున్నాడని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి kodali nani విమర్శించారు.
also read:గాజులు తోడుక్కోలేదు: పవన్‌కి మంత్రి కొడాలి నాని కౌంటర్
ఆదివారం నాడు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.chandrababu చేతిలో pawan kalyan గంగిరెద్దు అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి మద్దతు ఇస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఏ పార్టీ
డ్రగ్స్ వ్యవహరంలో విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. మాఫియాతో చంద్రబాబుకే సంబంధాలున్నాయని మంత్రి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఉత్తరాంధ్ర నుండి గంజాయి స్మగ్లింగ్ సాగిందని ఆయన ఆరోపించారు.
పొదుపు సంఘాలకు పావలా వడ్డీకి రుణాలిచ్చి ysr ప్రోత్సహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిచారన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో దొరికిన డ్రగ్స్ కు సంబంధించి తూర్పుగోదావరి, విజయవాడలకు లింకులున్నాయని మీడియాలో వార్తలు రావడంతో ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయమై సంబంధాలున్నాయనే ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను అధికార పార్టీ ఖండించింది.