Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.
 

AP SEC Nimma gadda Ramesh kumar meets governor Biswabhusan Harichandan over local body elections lns
Author
Amaravathi, First Published Nov 18, 2020, 11:13 AM IST

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

also read:జగన్ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ: నీలం సాహ్నీ లేఖకు నిమ్మగడ్డ ఘాటు రిప్లై

రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వహించాల్సిన అవసరం ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

 

గ్రామ పంచాయితీ ఎన్నికలపై ఎస్ఈసీ వివిధస్థాయిల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను కూడ నిర్వహించాలని భావించారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు లేఖ రాశారు.కరోనా అదుపులోకి రాలేదని సహానీ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖపై  నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించేవిధంగా ఈ లేఖ ఉందని నిమ్మగడ్డ సహానీకి రిప్లై ఇచ్చారు.

ఈ విషయాలపై గవర్నర్ కు ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios