తిరువూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు ప్రేరేపిత ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ కార్యకర్తలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. 

వైసీపీ కార్యకర్తల ఆగడాలను ఆ పార్టీ ఎమ్మెల్యే రక్షణ నిధి అరికట్టాలని కోరారు. ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల దాడులు ఎక్కువ అయ్యాయని ఆయన ఆరోపించారు. తనకు ఓటెయ్యని వారిపై ఎమ్మెల్యే రక్షణ నిధి దాడులు చేయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. 

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి తిరువూరు నియోజకవర్గాన్ని రక్షణ నిధి నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు రౌడీ యిజం చేస్తూంటే చూస్తూ కామ్ గా ఉండాలంటూ రక్షణ నిధి చెప్పడం అవగాహన రాహిత్యమన్నారు. టీడీపీ కార్యకర్తలను తాము కాపాడుకుంటామని అలాగే ఎమ్మెల్యే రక్షణనిధి వైఫల్యాలను ఎండగడతామని మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు.