ఉచితాల పేరుతో చంద్రబాబు ఏటా రూ. 950 కోట్లు వృధా చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు.
ఉచితాలపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలే చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అమలు చేస్తున్న ‘చంద్రన్న కానుక’లు ఒట్టి వృధాగా కొట్టేయటంతో పలువురు టిడిపి నేతలు అవాక్కయ్యారు. ఎందుకంటే, చింతకాయల అంటే మామూలు వ్యక్తి కాదు.
చంద్రబాబు మంత్రివర్గంలో సీనియర్ మంత్రి. విశాఖపట్నం జిల్లాలోని నాతవరం మడలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో బహిరంగంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
వివిధ పండుగల సందర్భాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచింతంగా అందచేయటంలో అర్ధం లేదన్నారు. ఉచితాల పేరుతో చంద్రబాబు ఏటా రూ. 950 కోట్లు వృధా చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. పైగా ఇలాంటి తాత్కాలిక పథకాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని కూడా చెప్పారు.
ఉచితాలపై డబ్బు వృధా చేసేబదులు పోలవరం లాంటి శాశ్వత ప్రాజెక్టులపై ఖర్చు పెడితే బాగుంటుందని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను స్వయంగా చంద్రబాబు వద్దే ప్రస్తావించానని కూడా చెప్పటం గమనార్హం.
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చంద్రన్నకానుక’ల పై ఒక్క చింతకాయలకేనా లేక మంత్రుల్లో ఇంకెవరికైనా కూడా ఇటువంటి అభిప్రయాలే ఉన్నయా అన్న విషయం తెలీదు. మరి, తన మంత్రివర్గ సహచరుడి అభిప్రాయాలపై చంద్రబాబు ఏమంటారో చూడాలి.
