రూ. 48 వేల కోట్ల అవినీతిని రుజువు చేస్తారా: టీడీపీకి ఏపీ మంత్రి బుగ్గన సవాల్

ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.  తాము రూ. 48 కోట్లు అవినీతికి పాల్పడినట్టుగా రుజువు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

AP minister Buggana Rajendranath Reddy reacts on Yanamala Ramakrishnudu comments

అమరావతి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 22 వేల కోట్లు కనపడని ఖర్చు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy సోమవారం నాడు సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ TDPకి చెందిన మాజీ మంత్రి Yanamala Ramakrishnudu మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు.  

రాష్ట్రంలో తక్షణమే 360 ఆర్ఠికల్ ను  ప్రయోగించాలని కోరారు. ఈ విషయమై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యనమల రామకృష్ణుడికి కౌంటర్ ఇచ్చారు.రూ. 48  కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ నేతలు నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు అర్ధం లేని వాదనలు విన్పిస్తున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. 

2022-23 ఏపీ బడ్జెట్ చూశాక టీడీపీకి అంకెల గారడి అని మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రూ.48 వేల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. బ్యాంక్ ట్రాన్జాక్షన్ తప్పుగా జరిగే పరిస్థితి లేదని మంత్రి వివరించారు. వేల కోట్ల ప్రజా ధనం ఎలా దుర్వినియోగం అవుతుందని మంత్రి ప్రశ్నించారు. సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పులు సరిదిద్దడానికి సమయం పడుతుందన్నారు. రూ. 48,509 కోట్లు స్పెషల్ బిల్లుల రూపంలో ఉన్నాయని మంత్రి వివరించారు.

5 అంశాల వారీగా ప్రతి దానికీ  పద్దు ఉంది. నిధులు దుర్వినియోగం జరగలేదన్నారు. అంశాల వారీగా కాగ్‌కు నివేదిక ఇచ్చామన్నారు. అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందించడం తప్పని మంత్రి చెప్పారు..  2018-19లో టీడీపీవి కుడా 98 వేల బుక్ అడ్జెస్ట్‌మెంట్స్ ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను టీడీపీ ప్రయివేట్ వ్యక్తి చేతిలో పెట్టిందని ఆయన ఆరోపించారు.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించామన్నారు.. ఒక రోజు ఆదాయం వచ్చిందని, ఒకరోజు రాలేదని ఆరోపణలు చేస్తారని యనమల రామకృష్ణుడు ఎదో ఒక స్టాండ్ తీసుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.

టీడీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్ల బకాయిలు పెట్టినందుకు ఫైనాన్షియల్‌ ఎమర్జెన్సీ పెట్టాలా? పోలవరం, రాజధానిపై మీ నిర్వాకాలకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలా ? బ్రీఫ్డ్ మీ అన్నందుకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలా?’’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. నోటుకు ఓటు కేసు, ఫైబర్ గ్రిడ్, టిడ్కోపై సీబీఐ విచారణకు సిద్ధమా ? అంటూ మంత్రి బుగ్గన సవాల్‌ విసిరారు.

2020-21లో 30 వేల కోట్ల ఆదాయం తగ్గినా కోవిడ్ పరిస్థితుల్లో సామాన్యులను కాపాడుకున్నామన్నారు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానివి డిబిటి పథకాలు. వైసీపీ ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చు చేసిందో అన్ని లెక్కలు ఉన్నాయని మంత్రి వివరించారు. 2017-18 టీడీపీ హయాంలో రూ.82 వేల కోట్లు కనపడని ఖర్చు ఉంది. అంటే ఈ నిధులు దుర్వినియోగం అయ్యాయా?. టీడీపీ 59 వేల కోట్లు వేస్ అఫ్ మిన్స్ తీసుకుని రూ.130 కోట్లు పెండింగ్‌లో పెట్టిందన్నారు.. పేదవాడి కోసం తమ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. టీడీపీ హయాంలో కత్తెర, ఇస్త్రీ పెట్టేల కోసం అప్పులు చేశారని ఆయన ఎద్దేవా చేశారు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పిల్లల చదువు కోసం అప్పు చేస్తుంది. ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ పెట్టాలని 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే వాదన మొదలెట్టారని దుయ్యబట్టారు. కాగ్‌కు పూర్తిస్థాయి వివరాలు అందజేశామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios