చంద్రబాబు నాయుడుకు ఏదో అయ్యిందని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడును చూస్తుంటే ఏదో ఒక డిఫెక్ట్ వచ్చినట్లు ఉందన్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మానసిక పరిస్థితిపై ఆందోళన కలుగుతుందన్నారు బొత్స సత్యనారాయణ.
అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ గడపగడపకు అందించాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయం వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ప్రతీ 2000 మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు 500 సేవలు అందించేందుకు తాము సచివాలయ వ్యవస్థను తీసుకువస్తే దానిపై చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
2003లోనే గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వార్డుల్లో అయితే మున్సిపాలిటీ, గ్రామాల్లో అయితే పంచాయితీ ఉండేదని ఈ వ్యవస్థలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
తాత్కాలిక సచివాలయం తానే కట్టానని పదేపదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు సచివాలయం అంటే తాత్కాలిక సచివాలయం అనుకుంటున్నారేమోనని విమర్శించారు. అమరావతి అని పేరుపెట్టి తాత్కాలిక కట్టడాలు కట్టిన సచివాలయం వేరు, గ్రామ సచివాలయం వేరు అని బొత్స వివరించారు. రెండింటికి తేడా తెలుసుకోవాలని బొత్స హితవు పలికారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలను గ్రామ సచివాలయాల ద్వారా నేరుగా ప్రజలకే అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కంటిచూపునకు ఏదో సమస్య వచ్చినట్లు ఉందన్నారు. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు.
చంద్రబాబు నాయుడుకు ఏదో అయ్యిందని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడును చూస్తుంటే ఏదో ఒక డిఫెక్ట్ వచ్చినట్లు ఉందన్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మానసిక పరిస్థితిపై ఆందోళన కలుగుతుందన్నారు బొత్స సత్యనారాయణ.

ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఖండించాలనుకున్నా ప్రోత్సహించాలనుకున్నా నేరుగా అర్థవంతమైన చర్చ పెడితే బాగుండేదన్నారు. అంతేకానీ వైసీపీ చేపట్టే పథకాలన్నీ తమవేనని పేరుమార్చి అమలు చేస్తున్నారంటూ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎవరు ప్రారంభించారో చెప్పాలని నిలదీశారు. దాని పేరు మార్చింది మీరు కాదా అని నిలదీశారు. కంటి వెలుగు పథకాన్ని ఎవరు ప్రారంభించారో చెప్పాలని నిలదీశారు.
