మా వ్యూహాలు మాకున్నాయి: కృష్ణానది జలాల వివాదంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మేం మౌనం లేం... మా వ్యూహాలు మాకున్నాయని ఆయన వివరించారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మేం మౌనం లేం... మా వ్యూహాలు మాకున్నాయని ఆయన వివరించారు.బుధవారం నాడు ఆయన ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. నీటి పంపకాల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితోనే ఉందన్నారు మంత్రి.ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారులు వారికి ఉంటాయన్నారు. తెలంగాణ మంత్రుల మాదిరిగా తాము అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదని చెప్పారు.
also read:శ్రీశైలం నుండి 40 శాతం నీటి వాడకం: తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ మరో లేఖ
చట్టపరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకొంటాయని మంత్రి తేల్చి చెప్పారు. కేఆర్ఎంబీకి పూర్తిగా సహకరిస్తామని మంత్రి తెలిపారు.విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలుంటాయని మంత్రి వివరించారు. తాము చేతులు ముడుచుకు కూర్చోలేమని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిరసిస్తూ రెండు దఫాలు కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు ఇప్పటికే జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది.