అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు సూచనలు, సలహాలు తమకు అవసరం లేదన్నారు. 

అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా తీర్మానంపై మాట్లాడిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తానని ప్రకటించారు. 

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన బొత్స ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబ సలహాలు తమకు అవసరం లేదని తేల్చి చెప్పేశారు.  మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. 

అమరావతిలో ఎలాంటి అక్రమాలు జరిగాయో విచారణలో తేలుతుందన్నారు. ఈ వ్యవహారంపై తాము మొదట్నుంచీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నామని చెప్పారు. త్వరలో మరిన్ని స్కామ్ లు వెలుగులోకి రాబోతున్నాయంటూ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.