అమిత్ షా చెప్పేవరకు విశాఖలో భూదందా గురించి తెలియదా?: బీజేపీకి బొత్స కౌంటర్
కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు.
అమరావతి: అమిత్ షా చెప్పేవరకు విశాఖలో భూదందా జరిగినట్టు బీజేపీ నేతలకు తెలియదా అని ఏపీ మంత్రి ప్రశ్నించారు.బుధవారంనాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా , బీజేపీ నేతల విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు.
విశాఖపట్టణంలో భూదందా జరిగితే ఇంతవరకు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.బుధవారంనాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా చెప్పేవరకు రాష్ట్రంలో అవినీతి జరిగిందని జీవీఎల్ కు తెలియదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇంతకాలం పాటు ఎందుకు ప్రశ్నించలేదో జీవీఎల్ ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ చదివారని అర్ధమౌతుందన్నారు.
ప్రధానితో మా బంధం ఎలా ఉందో అమిత్ షాతో అలానే ఉందని ఆయన చెప్పారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువగా లేవని మంత్రి వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవిగా మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా రెండు వందేభారత్ రైళ్లు తప్పు బీజేపీ ఏమిచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
also read:ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల: ఇంజనీరింగ్ లో 76.32 శాతం ఉత్తీర్ణత
9 ఏళ్ల తర్వాత రెవిన్యూ లోటు నిధులిచ్చామంటే ఎలా అని మంత్రి అడిగారు. వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలన్నారు. బీజేపీ నుండి తమకు ప్రత్యేకంగా వెన్నుదన్ను లేదన్నారు.తమకు ఏ పార్టీతో పొత్తు లేదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎవరిపై ఆంక్షలు లేవని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రనుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.