ఒంగోలు:  షర్మిల పార్టీ ఏపీలో లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.బుధవారం నాడు ఒంగోలులో ఆయన  మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోనే పార్టీ పెట్టాలని షర్మిల భావిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణతో సఖ్యత కోసమే వైసీపీ అక్కడ కార్యక్రమాలను నిర్వహించడం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల మంగళవారం నాడు లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన  వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

also read:ఇంతకీ వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం?

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎవరూ కూడ సంతోషంగా లేరని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు తాను తెలంగాణలో పనిచేస్తానని ప్రకటించారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించాలని షర్మిల భావిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశం కానున్నారు. త్వరలోనే షర్మిల పార్టీని  ప్రకటించే అవకాశం ఉంది.  క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి తదితర అంశాలపై షర్మిల అభిమానులతో చర్చించనున్నారు.