విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు: పురంధేశ్వరీకి మంత్రి అవంతి కౌంటర్
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత పురంధేశ్వరీ చేసిన విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండ్డిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
విశాఖపట్టణం: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత పురంధేశ్వరీ చేసిన విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత పురంధేశ్వరీ చేసిన విమర్శలపై ఆదివారం నాడు మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు.
ఏపీ అప్పుల గురించి పురంధేశ్వరి మాట్లాడుతున్నారన్నారు.. కేంద్రం అప్పులు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. విభజన హామీల అమలుపై BJP నాయకులు, Purandeswari చేసున్న కృషి ఏమిటో చెప్పాలన్నారు. విశా స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని ఇప్పటికే రెండు సార్లు సీఎం కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. పురంధేశ్వరికి చిత్త శుద్ది ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలన్నారు. నిజంగా Pawan Kalyan కు ఏపీపై శ్రద్ధ ఉంటే కేంద్రంపై Visakha steel plant ప్లాంట్ కోసం పోరాటం చేయవచ్చు కదా అని Avanthi Srinivas సూచించారు.
విశాఖ జిల్లాలో భూ సేకరణపై పిల్ కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సేకరణకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ధి చేకూరనుందని అన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని మంత్రి చెప్పారు.
భూ సేకరణతో 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం దక్కుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని TDP కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్యానికి YCP అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.