అమరావతి:సీఎం జగన్‌ను విమర్శిస్తే తాను చూస్తే ఎంతటివారైనా చూస్తూ ఊరుకోనని ఏపీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. తమ నాయకుడిని విమర్శించిన వారు ఎంత గొప్పవాడైనా దాడి చేస్తానని హెచ్చరించారు.

Also read:కర్నూల్‌లో అదృశ్యమై పులివెందులలో ప్రత్యక్షమైన రుద్రవరం ఎస్ఐ

మంత్రి అనిల్ కుమార్ రాష్ట్రంలో జరిగిన ఏ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ ఏమన్నా భరిస్తానన్నారు. తనకు మంత్రి పదవి వచ్చినా ఎమ్మెల్యే సీటు దక్కినా  అదంతా జగన్ అన్న ఇచ్చిన బిక్షే అని అనిల్ కుమార్ చెప్పారు.

జగనన్న ఎమ్మెల్యే సీటిస్తే నెల్లూరు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన గుర్తు చేశారు. జగనన్నను ఎవరన్నా ఏమైనా అంటే ముందు వెనక ఆలోచించను.. వెంటనే వారిపై దాడి చేస్తానన్నారు మంత్రి అనిల్ కుమార్. అన్నపై విమర్శలు చేస్తే వెంటనే తనకు వాడు ఎంత తోపు, మాజీయా,గొప్పోడా అనే విషయాన్ని ఆలోచించే పరిస్థితి ఉండదని ఆయన  వివరించారు.


విపక్షాలు ముఖ్యంగా టీడీపీ చేస్తున్న విమర్శలను  సమర్ధవంతంగా తిప్పికొట్టే మంత్రుల్లో అనిల్ కుమార్ కూడ ఒక్కరు. అసెంబ్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.

టీడీపీపై ఒంటికాలిపై మంత్రి అనిల్ కుమార్ విమర్శలు చేస్తున్నారు.తాజాగా మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.