Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్‌కి జ్యుడిషీయల్ కేపిటల్, ఆగష్టు 15 తర్వాత మీరే చూస్తారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మరికొన్ని రోజుల్లోనే కర్నూల్ కు జ్యుడిషీయల్ రాజధాని వచ్చేస్తుందని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  కర్నూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఆగష్టు 15 తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి సురేష్ చెప్పారు.. 

AP Minister adimulapu suresh Interesting Comments On Three Capital Cities
Author
Kurnool, First Published May 16, 2022, 4:34 PM IST

కర్నూల్:  మరికొన్నిరోజుల్లోనే కర్నూల్ కు జ్యూడిషీయల్ కేపిటల్ వచ్చేస్తుందని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  Adimulap suresh ప్రకటించారు. సోమవారం నాడు కర్నూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 15 తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.Kurnool కు పెద్ద కంపెనీలు, సెజ్ లు రాబోతున్నాయని కూడా ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ లో అవినీతి ఉందన్నారు. విజిలెన్స్, ACB  కేసుల ఫైల్స్ చూస్తే  150 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. టౌన్ ప్లానింగ్ తీరు మారాల్సిన అవసరం ఉందని మంత్రి సురేష్ అభిప్రాయపడ్డారు.  సిటీ ప్లానర్ ఈ విషయంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.  కింది స్థాయి సిబ్బంది పై నెపం వేస్తే కుదరదని ఆయన చెప్పారు. Andhra Pradesh లో సుమారు 16 వేల అక్రమ లే ఔట్లు ఉన్నాయన్నారు. వీటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని మంత్రి చెప్పారు. మరో వైపు రాష్ట్రంలో నిధుల సమస్య లేదని మంత్రి తేల్చి చెప్పారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామన్నారు. మిగిలిన వాటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Chandrababu  ప్రభుత్వం గ్రాఫిక్స్ తో అమరావతి అభివృద్ది చూపిందని ఆయన విమర్శించారు. అమరావతి చుట్టూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఓ సామాజిక వర్గానికే అభివృద్ది జరిగేలా చంద్రబాబు సర్కార్ పనిచేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.

ఏపీలో వైఎస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత Three Capitals అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చింది.  అమరావతిని శాసన రాజధాని, కర్నూల్ ను  న్యాయ రాజధానిగా,  విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు CRDA చట్టాన్ని రద్దు చట్టంతో పాటు మూడు రాజధానుల చట్టాలను చేసింది. 

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.  అమరావతి ప్రాంత రైతులు ఆందోళన నిర్వహించారు.

also read:అమరావతే రాజధాని.. విశాఖను అభివృద్ధి చేస్తా : మూడు రాజధానులపై తేల్చేసిన చంద్రబాబు

అయితే మూడు రాజధానులపై TDP సహా పలు పార్టీలు అమరావతి ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే  2021 నవంబర్ 23న  హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొంటామని ప్రకటించింది. అదే రోజున  అసెంబ్లీలో ఈ బిల్లును వెనక్కి తీసుకొంటూ బిల్లును ప్రవేశ పెట్టింది.

మూడు రాజధానుల అంశంపై ఈ నెల 3వ తేదీన AP High Court కీలక తీర్పును ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారంగానే ముందుకు వెళ్లాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారంలో Assemblyకి లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ వాదనను ప్రభుత్వం కొట్టిపారేసింది. చట్ట సభలు చట్టాలు చేసేందుకే ఉన్నాయని కూడా గుర్తు చేస్తున్నారు. మూడు నెలల్లో రైతులకు ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వాలని కూడా ఏపీ హైకోర్టు  ఆదేశించింది.

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో Amaravathi రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  అయితే మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అయితే న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా బిల్లులను తీసుకు రావాలని ఏపీ సర్కార్  ప్లాన్ చేసింది. ఈ తరుణంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా  మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios