Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో వైసిపి శుభారంభం... పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికారపార్టీదే ఆధిక్యం (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయమే ప్రారంభమవగా కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో అధికార వైసిపికే అధిక ఓట్లు లభించాయి. 

AP Localbody Election Result 2021... YSRCP Lead Postal Ballot votes in  Krishna District
Author
Amaravati, First Published Sep 19, 2021, 10:00 AM IST

విజయవాడ: మైలవరం నియోజకవర్గంలో మొత్తం 59 ఎంపీటీసీ స్థానాలకు గాను 1 స్థానం ఏకగ్రీవం కాగా 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ(ఆదివారం) ఉదయమే ఓట్లలెక్కింపు ప్రారంభమవగా ఇప్పటివరకు మైలవరం, జి.కొండూరు మండలాల ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. మైలవరం మండలం వైసీపీ 40, టీడీపీ2 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఇక జి.కొండూరు మండలంలో వైసీపీ 28, టీడీపీ 11 ఓట్లు రాగా ఒ్ ఓటు చెల్లకుండాపోయింది.  

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో 13, మైలవరం మండలంలో 19, జి.కొండూరు మండలంలో 16, ఇబ్రహీంపట్నం మండలంలో 11 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి ఏకగ్రీవం అవగా మిగతా 58స్థానాల్లో ఎన్నికలు జరగ్గా ఇవాళ ఫలితం వెలవడనుంది.  

వీడియో

ఇక మైలవరం నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీ స్థానాలుండగా జి.కొండూరు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడంతో జెడ్పీటీసీ ఎన్నిక జరగకుండా వాయిదా పడింది. మిగతా మూడు చోట్ల(రెడ్డిగూడెం, మైలవరం, ఇబ్రహీంపట్నం) ఎన్నికలు జరిగాయి. ఇవాళ వీటి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. 

read more  ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు: ఖాతా తెరిచిన పవన్ కల్యాణ్ జనసేన

మైలవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మైలవరం,జి.కొండూరు మండలాల కౌంటింగ్ మైలవరంలోని ఎల్బీఆర్సీ స్టేడియంలో, ఇబ్రహీంపట్నం మండల కౌంటింగ్ జూపూడి నోవా కాలేజీలో జరుగుతోంది. 

నూజివీడు నియోజకవర్గంలో కూడా ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నూజివీడులోని శ్రీ సారథి ఇంజనీరింగ్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభించారు ఎన్నికల సిబ్బంది. నియోజకవర్గంలోని మూడు మండలాలలో కౌంటింగ్ నూజివీడులో నిర్వహిస్తుండగా, చాట్రాయి మండలానికి చెందిన ఓట్లను విస్సన్నపేటలో నిర్వహిస్తున్న అధికారులు.

Follow Us:
Download App:
  • android
  • ios