పంచాయితీ ఎన్నికలు: జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
కృష్ణా జిల్లాలోని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
విజయవాడ: కృష్ణా జిల్లాలోని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.వేరే పార్టీ నుండి పోటీ చేస్తే ఊరుకోనని ఆయన తేల్చి చెప్పారు.
సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా కూడ వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి వంటి పథకాలు కట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. తొలి విడత జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన అభ్యర్ధులు ఎక్కువగా విజయం సాధించారు. టీడీపీ గెలిచినట్టుగా ప్రకటించిన అభ్యర్ధుల విషయంలో వైసీపీ తప్పుబట్టింది. టీడీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని వైసీపీ విమర్శలు గుప్పించింది.