Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన నామినేషన్‌ల ప్రక్రియ..

ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఓ కదలిక మొదలయ్యింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమైంది. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడులో టీడీపీ అభ్యర్థులు తొలి నామినేషన్‌లు వేశారు.
 

ap local body elections : nominations started in guntur district - bsb
Author
Hyderabad, First Published Jan 25, 2021, 1:37 PM IST

ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఓ కదలిక మొదలయ్యింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమైంది. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడులో టీడీపీ అభ్యర్థులు తొలి నామినేషన్‌లు వేశారు.

పంచాయతీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంత వరకు రెవిన్యూ డివిజన్లలో ఎక్కడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. 

అయితే గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగింది. 

ఎన్నికల అధికారి జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ పై ప్రభుత్వం వ్యతిరేకత చూపిస్తోంది. సుప్రీం కోర్టు కి కూడా ఎక్కింది.కాగా.. ఎన్నికల అధికారి చెప్పిన వివరాల ప్రకారం నేడు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. 

ఈ క్రమంలో.. అనంతపురం జిల్లాలో  ఉదయం ఓ వ్యక్తి నామినేషన్ వేయడానికి రాగా.. ఆ అభ్యర్థిని అధికారులు వెనక్కి పంపించేశారు. హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన షమీన్ తాజ్ అనే అభ్యర్థిని నామినేషన్ వేయడానికి వస్తే.. వేయకుండానే వెనక్కి పంపించేశారు. 

నామినేషన్ పత్రాలు ఇంకా  రాలేదని అభ్యర్థికి కార్యాలయం అధికారులు తెలిపారు. మరోవైపు గుంటూరులో పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు హడావిడి లేకుండా నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ పత్రాలు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు బాధ్యతలు కేటాయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios