జనసేన పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ వైఖరిని తప్పుబట్టారు. నిన్న ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆ నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. 

ఆయన నేరుగా గవర్నర్ ని వెళ్లి కలిసి కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఆయన ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధీ చంద్రబాబుధీ ఒకటే కులం కావడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని, తమకు 151 సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించారని, అయినా తమ మాటకు విలువ లేకపోవడం బాధాకరం అని జగన్ అన్నారు. 

కరోనా వైరస్ ని చాలా చిన్నదిగా కొట్టిపారేస్తున్న జగన్ సర్కార్ వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ... మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు.  ప్రాణాల కన్నా ఎన్నికలు ముఖ్యమా అంటూ ఒక ట్వీట్ చేసారు నాగబాబు. "ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా ,మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా,అన్నిటికన్నా ,మనిషి ప్రాణాలు ముఖ్యం కదా.ఎన్నికలు ఆపలేదు,వాయిదా చేశారు.ఈ ఎలక్షన్ అకౌంట్ లో కారోన ఎఫెక్ట్ కిఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా. వైసీపీ వాళ్ళకి వాళ్ళ సపోర్టర్స్ కి ఎందుకు ఇంత బాధ..." అని అన్నారు. 

ఇదే ట్వీట్ కి అనుబంధంగా మరో రెండు ట్వీట్లు కూడా చేసారు. ఇక మీడియా వారు వైసీపీ కన్నా ఎక్కువ బాధపడిపోతున్నారంటూ ఎద్దేవా చేసారు. "కొంత మంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదా ని వాళ్ల వెబ్ సైట్లలో విమర్శిస్తుంటే ఆశ్చర్య పోయాం.మీరు వైసీపీ ని సమర్ధిస్తే తప్పు లేదు..కానీ వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఎడవలో అర్థం కాలేదు. ప్రాణం  కన్నా ఏది ఎక్కువ కాదు.బాధ పడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి" అంటూ మీడియా చానెళ్లకు హితవు పలికారు. 

ఇక మరో అనుబంధ ట్వీట్లో జగన్ కి థాంక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రావు.భరించాలి.ప్రజారోగ్యం ముఖ్యం.దాని మీద దృష్టి పెట్టండి. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి..151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం.థాంక్స్ సీఎం గారు"అని విమర్శనాస్త్రాలను సెటైరికల్ గా ఎక్కుపెట్టారు. 

ఇక నిన్న కరోనా వైరస్ ప్రపంచానికే ఉచ్చ పోయిస్తుందంటూ మరొక ట్వీట్ చేసారు. కరోనా అమ్మ మొగుళ్ళు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. "మనకన్నా అన్ని విధాలా బలహీనుడు, చిన్నవాడు,ఆని ఎవరినీ తక్కువగా చూడొద్దు...వైరస్ కూడా మనకన్నా చిన్నదే ,అసలు కంటికె కనబడదు.కొన్ని సార్లు ప్రపంచానికే సుస్సు (ఉచ్చ)పోయిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళే వణుకుతున్నారు.. మనమెంత.రెస్పెక్ట్ అందరిని గౌరవించాలి. కారోన అమ్మా మొగుళ్లు వచ్చిన ఆశ్చర్యపోకండి."