హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరుపై టీడీపీ ఎమ్మెల్సీల ఆందోళన: రెండుసార్లు ఏపీ శాసనమండలి వాయిదా


హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్  పేరు పెట్టాలనే ప్రతిపాదనను మార్చుకోవాలని ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో రెండు సార్లు మండలి వాయిదా పడింది. 
 

AP Legislative Council Adjourned Second Time After TDP MLAs Protest

అమరావతి: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శాసనమండలిలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో రెండు సార్లు ఏపీ శాసనమండలి వాయిదా పడింది. 

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై టీడీపీ సభ్యులు ఇవాళ శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని మండలి చైర్మెన్ మోషేన్ రాజు తిరస్కరించారు. అయితే ఈ విషయమైచర్చకు  టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.  చైర్మెన్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్సీలు నిలబడి ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యలు, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. 
హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చేందుకు తీసుకు వచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నిరసన కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.  ఈ పరిస్థితుల్లో మండలి చైర్మెన్  మోషేన్ రాజు మండలిని వాయిదా వేశారు.

also read:కూతురిని గిఫ్ట్ ఇస్తే వెన్నుపోటుతో ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై జగన్ సెటైర్లు

ఆ తర్వాత మండలి తిరిగి ప్రారంభమైంది, మండలి ప్రారంభమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని  టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీకి బీజేపీ, పీడీఎఫ్, ఎస్టీయూ సభ్యులు కూడ తమ మద్దతు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో కూడా హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టే విషయమై టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios