Asianet News TeluguAsianet News Telugu

నేటినుండే ఏపీలో జూడాల సమ్మె... నల్ల బ్యాడ్జీల నుండి ఎమర్జెన్సీ సేవల బంద్ వరకు

ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇవాళ్టి నుండి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెెలియజేయనున్నట్లు జూడాల అసోసియేషన్ ప్రకటించింది.  

AP Junior Doctors Association calls Strike
Author
Amaravati, First Published Dec 1, 2021, 10:13 AM IST

అమరావతి: తమ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ఏపీ జూడాల అసోసియేషన్ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు junior doctors association ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. 

తమకు ఇస్తున్న స్టైఫండ్‌లో 10% టాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని జూడాలు తప్పుబడుతున్నారు. సెక్షన్ 10(16) కింద స్టైఫండ్‌ను స్కాలర్ షిప్‌గా పరిగణించి ట్యాక్స్ కట్ చేయకూడదని డిమాండ్  చేస్తున్నారు. అలాగే త్వరితగతిన నీట్(NEET), పీజీ కౌన్సిలింగ్ జరిపి రిక్రూట్ చేసుకోవాలని మరో డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి ఇవాళ్టి(బుధవారం) నుండి సమ్మెకు దిగుతున్నట్లు జూడాల అసోసియేషన్ ప్రకటించింది. 

READ MORE  కృష్ణాలో ఉద్ధృతి.. ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, 20,70,014కి చేరిన సంఖ్య

ఇవాళ్టి నుండి ప్రతిరోజు ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడానికి జూడాల అసోసియేషన్ కార్యాచరణ రూపొందించింది. బుధవారం తాము పనిచేసే హాస్పిటల్స్ వద్ద నల్ల బ్యాడ్జ్‌లతో జూడాలు నిరసన చేపట్టనున్నారు. డిసెంబర్ 2న అంటే రేపు సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్ నిర్వహించనున్నారు.డిసెంబర్ 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖల సమర్పించనున్నారు. డిసెంబర్ 4న ట్విట్టర్ తుఫాను, మాస్ మెయిలింగ్ రూపంలో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. 

ఇక డిసెంబర్ 5వ తేదీ నుండి తమ నిరసనను మరింత తీవ్రతరం చేయనున్నారు. 5న ఆసుపత్రిలో ఓపీడీ సేవలను నిలిపివేయనున్నట్లు... డిసెంబర్ 7 నుంచి ఐచ్ఛిక సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్లు జూడాలు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. 

read more  NTR University: రేపటి నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉద్యోగుల విధుల బహిష్కరణ.. నిధుల మళ్లింపుపై ఆగ్రహం

ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ప్రముఖ ప్రభుత్వ దవాఖానా ఉస్మానియాలో పనిచేసే జూడాలు నిరసనకు దిగారు. ప్రజల ప్రాణాలు కాపాడే తమకే రక్షణ లేకుండా పోయిందంటూ వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. 

తెలంగాణ ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఇదే హాస్పిటల్ ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తుండగా ఓ డాక్టర్ తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో రోగులకే కాదు తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ జూనియర్ డాక్టర్లు వినూత్న నిరసన చేపట్టారు. 

హైదరాబాద్ అప్జల్ గంజ్ లోని osmania general hospital లో భువనశ్రీ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే గత సోమవారం కూడా ఆమె విధులకు హాజరయ్యారు. అయితే డెర్మటాలజీ విభాగంలో పేషెంట్స్ కు వైద్యసేవలు అందిస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడి ఆమెపై పడింది. దీంతో డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ఘటన ఉస్మానియా హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లలో కలవరానికి కారణమయ్యింది. రోగుల ప్రాణాలకు కాపాడే తమకే రక్షణ లేకుండా పోయిందంటూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఓరోజు ఔట్ పేషెంట్ బ్లాక్ లో మౌనంగా వుంటూ నిరసన తెలియజేసిన జూడాలు మరోరోజు ద్విచక్రవాహనదారులు ఉపయోగించే హెల్మెట్లను తలకు ధరించి విధులకు హాజరయ్యారు.  

Follow Us:
Download App:
  • android
  • ios