Asianet News TeluguAsianet News Telugu

ఆ ఫిట్‌మెంట్ సరిపోదు... పరిష్కారం కాకుంటే, 9వ తేదీన కార్యాచరణ చెబుతాం: బొప్పరాజు

అధికారుల కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్ 14.29 తో నష్టపోతామని సీఎంకి చెప్పామన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (boppa raju venkateswarlu) . పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్‌తో (ys jagan) సమీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కి ఒకేసారి ఇవ్వాలని కోరామన్నారు. 

ap jac leader bopparaju venkateswarlu comments on prc
Author
Amaravathi, First Published Jan 6, 2022, 8:20 PM IST

అధికారుల కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్ 14.29 తో నష్టపోతామని సీఎంకి చెప్పామన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (boppa raju venkateswarlu) . పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్‌తో (ys jagan) సమీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కి ఒకేసారి ఇవ్వాలని కోరామన్నారు. సీపీఎస్ (cps) రద్దుపై స్పష్టత ఇవ్వాలని కోరామని.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ కోసం చూస్తున్నారని నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు బొప్పరాజు వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏ లు విడుదల చేయాలని, హెల్త్ కార్డుల సమస్యని పరిష్కరించాలని కోరామని బొప్పరాజు తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు.

మా సమస్యలన్నీ సీఎం మంచి హృదయంతో విన్నారని.. రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిని వివరించారని బొప్పరాజు పేర్కొన్నారు. ఫిట్‌మెంట్ విషయంలో ఉద్యోగ సంఘాలు ఒక మెట్టు దిగాలని అధికారులు ఒక మెట్టు ఎక్కాలని సీఎం చెప్పారన్నారు. రెండు రోజుల్లో అందరికి మంచి జరిగేలా పీఆర్సీ ప్రకటన చేస్తానని సీఎం చెప్పారని బొప్పరాజు పేర్కొన్నారు. కొత్త ఫిట్‌మెంట్ ఐఆర్‌కి తగ్గకుండా ఇవ్వాలని స్పష్టం చేస్తామని.. పీఆర్సీ అనేది ఉద్యోగులకు గౌరవంగా ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. 9వ తేదీన విస్తృత స్థాయి సమావేశం  జరుగుతుందని.. మా సమస్యలు పరిష్కారం అవ్వకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెల్లడించారు.

27 శాతం కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ కావాలనే తాము సీఎం‌ను కోరామని.. 50 శాతం ఫిట్‌మెంట్ కావాలని తాము మొదట్నుంచీ కోరుతున్నామని ఏపీ జేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని.. కోవిడ్‌తో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగాలేవని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులతో పోల్చుకోవద్దని సీఎం జగన్ సూచించారని.. తెలంగాణకు హైదారాబాద్ నుంచి ఆదాయం ఉన్నందున ఆ రాష్ట్రంతో పోల్చుకోవద్దని జగన్ చెప్పారని శ్రీనివాస్ పేర్కొన్నారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా తాము పనిచేస్తామని చెప్పామని బండి పేర్కొన్నారు. 
ఉద్యోగులకు సీఎం జగన్ మంచి పీఆర్సీ ఇస్తారని ఆయన ఆకాంక్షించారు. 

అంతకుముందు prcపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేయనున్నట్టుగా ఏపీ సీఎం Ys Jagan ప్రకటించారు. ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు మధ్యాహ్నం సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలు సీఎంతో సమావేశానికి హాజరయ్యాయి.  ప్రాక్టికల్ గా ఆలోచించాలని Employees సంఘాలను సీఎం వైఎస్ జగన్ కోరారు.ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోటు చేసుకొన్నానని జగన్ తెలిపారు. అన్నింటిని స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని జగన్ తేల్చి చెప్పారు.

మెరుగైన పీఆర్సీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని జగన్ ఉద్యోగ సంఘాలను కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్టుగా సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రాక్టికల్ గా ఆలోచించాలని సీఎం కోరినట్టుగా తెలుస్తోంది.. సీఎంతో సమావేశానికి ముందే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సీఎంతో జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై  చర్చించారు. సుమారు నెల రోజుల నుండి పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కానీ పీఆర్సీ  విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఇవాళ జరిగిన సమావేశంలో కూడా పీఆర్సీపై స్పష్టత రాలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios