Asianet News TeluguAsianet News Telugu

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్: మీరు రావొద్దు.. కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి లేఖ

రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్ర స్థాయి పర్యటనను రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు లేఖ రాశారు. రాయలసీమ లిఫ్ట్ సీఈ, ఎస్ఈలు కరోనా బారిన పడ్డారని లేఖలో స్పష్టం చేసిన ఇరిగేషన్ సెక్రటరీ... కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని వెల్లడించారు.

ap irrigation write a letter to krmb over rayalaseema lift irrigation ksp
Author
Amaravathi, First Published Apr 18, 2021, 7:24 PM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్ర స్థాయి పర్యటనను రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు లేఖ రాశారు. రాయలసీమ లిఫ్ట్ సీఈ, ఎస్ఈలు కరోనా బారిన పడ్డారని లేఖలో స్పష్టం చేసిన ఇరిగేషన్ సెక్రటరీ... కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ క్షేత్ర స్థాయి పర్యటన సాధ్యం కాదని కేఆర్ఎంబీకి తెలియజేశారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలనుకున్న కేఆర్ఎంబీకి ఇంకా పరిధిని కూడా నిర్ధారించ లేదని లేఖలో శ్యామలరావు ప్రస్తావించారు.

పర్యవేక్షక బృందంలోని కొందరి సభ్యులపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ బోర్డు మీటింగులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేపడుతోన్న ప్రాజెక్టుల పరిశీలనపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని లేఖలో స్పష్టం చేసింది ఏపీ.
 
Follow Us:
Download App:
  • android
  • ios