న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్‌.జయలక్ష్మి సీబీఐ ఎస్పీగా నియమితులయ్యారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్న ఆర్ జయలక్ష్మీ డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. 

2006 బ్యాచ్‌కు చెందిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. చిత్తూరు అర్బన్ తొలి మహిళా ఎస్పీగా ఆమె రికార్డు సృష్టించారు. నెల రోజుల క్రితం ఆమెను సీబీఐ ఎస్పీగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్రం ఆదేశాలతో ఆమె డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గురువారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం డిప్యుటేషన్ పై వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఐపీఎస్ అధికారిణి ఆర్. రాజ్యలక్ష్మి స్థానంలో మరోకొరని నియమించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్.జయలక్ష్మి నాలుగేళ్లపాటు  కేంద్ర సర్వీసులలో పనిచేయనున్నారు. ఆమెతోపాటు ఢిల్లీలో డీసీపీగా పనిచేస్తున్న 2007 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి నుపుర్ ప్రసాద్ ను కూడా సీబీఐ ఎస్పీగా కేంద్రం నియమించింది.