Asianet News TeluguAsianet News Telugu

AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2022 విడుదల ఎప్పుడు.. ఎలా చూసుకోవాలంటే....

AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్- bie.ap.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

AP Inter Supplementary Result 2022 At Bie.ap.gov.in
Author
Hyderabad, First Published Aug 24, 2022, 12:46 PM IST

అమరావతి : BIEAP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2022 ఎలా చూసుకోవాలంటే.. ఆంధ్రప్రదేశ్ (AP) ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్- bie.ap.gov.inలో ప్రకటిస్తారు. సప్లిమెంటరీ ఎగ్జామ్ 2022 విడుదల తేదీపై అధికారిక అప్‌డేట్ ఇప్పటివరకు లేదు. కానీ ఫలితాల విడుదల తరువాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- bie.ap.gov.inలో స్కోర్‌కార్డ్‌ని చెక్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొదటి, రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3, 2022న జరిగాయి. AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2022ని చెక్ చేసుకోవడానికి  అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్‌ను అడిగిన కాలమ్ లో నింపాలి. అప్పుడు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితం 2022 స్క్రీన్‌పై కనిపిస్తుంది. వెంటనే రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసిపెట్టుకుంటే సరి. 

AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2022 : స్కోర్‌కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. 

- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.inలో లాగిన్ కావాలి
- సప్లిమెంటరీ పరీక్ష ఫలితం 2022 లింక్‌పై క్లిక్ చేయాలి
- లాగ్-ఇన్ క్రెడెన్షియల్స్.. రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ ఇవ్వాలి
- AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి, తరువాత రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP ఇంటర్ ఫలితాలు 2022 ముందుగా జూన్ 22న ప్రకటించారు. మే 6 నుండి 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు మొత్తం 4.64 లక్షల (4,64,756) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటి సంవత్సరం పరీక్షలో 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండవ సంవత్సరం 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios