Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల ఆలస్యం.. సాయంత్రం 6 గంటలకు రిజల్ట్స్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి వుంది. అయితే అనుకోని కారణాల వల్ల గంట ఆలస్యంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. 

ap inter results 2023 releasing to be late ksp
Author
First Published Apr 26, 2023, 4:39 PM IST

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. సాయంత్రం 6 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి వుంది. అయితే అనుకోని కారణాల వల్ల గంట ఆలస్యంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. 

ALso Read: నేడే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..

కాగా.. ఈ సంవత్సరం మార్చి 15వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా.. మార్చి 16వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీన ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో 10,03,990 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది ఉండగా.. రెండో సంవత్సరానికి చెందిన విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షా ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios