ఏపీలో నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు : 175 ప్రైవేట్ కాలేజీలకు నోటీసులు

నిబంధనలు పాటించని కారణంగా 175 ప్రైవేట్  జూనియర్ కాలేజీల్లో  ప్రభుత్వం  చర్యలకు సిద్దమైంది. ఈ కాలేజీల్లో చదువుతున్న 20వేల మంది విద్యార్ధులను  వేరే కాలేజీల్లో  చేర్చాలని ఆదేశించారు.

AP Inter board  issues notice to 175  private colleges

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనిమ 175 ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం  చర్యలు  తీసుకుంది.ప్రభుత్వ నిబంధనలు పాటించని 175 ఇంటర్  కాలేజీలపై చర్యలు తీసుకుుంటున్నట్టుగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆయా కాలేజీల యాజమాన్యాలకు సమాచారం పంపారు.ఈ కాలేజీల్లో చదువుతున్న 20  వేల మంది విద్యార్ధులను  వేరే కాలేజీల్లో  చేర్పించాలని   కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆదేశించారు. 

కాలేజీలు నిర్వహిస్తున్న భవనాలకు అనుమతి పొందిన ప్లాన్ లేకపోవడం, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం  చెబుతుంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని  ఇంటర్ బోర్డు జూనియర్ కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది.  అయితే  ఈ  నిబంధనలను  పాటించని కారణంగా   ప్రైవేట్  జూనియర్  కాలేజీలపై చర్యలు తీసుకుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios