Asianet News TeluguAsianet News Telugu

సెలవుపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్.. వివాదం, క్లారిటీ ఇచ్చిన తానేటి వనిత

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.  రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్యకు అనారోగ్యంగా వుందని, అందుకే ఆయన సెలవు పెట్టారని హోంమంత్రి తానేటి వనిత క్లారిటీ ఇచ్చారు. 

ap home minister taneti vanitha gave clarity on rajahmundry central jail superintendent rahul leave ksp
Author
First Published Sep 15, 2023, 4:03 PM IST

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అక్కడే రిమాండ్‌లో వున్నారు . ఈ నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్యకు అనారోగ్యంగా వుందని, అందుకే ఆయన సెలవు పెట్టారని వనిత క్లారిటీ ఇచ్చారు. సెంట్రల్ జైలులో బ్లాక్ మొత్తం చంద్రబాబుకి కేటాయించామని.. సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని హోంమంత్రి పేర్కొన్నారు. 

ALso Read : జైల్లో చంద్రబాబు: సూపరింటిండెంట్ రాహుల్ సెలవుపై అనుమానాలు

మరోవైపు టీడీపీ - జనసేన పొత్తుపై తానేటి వనిత స్పందించారు. పొత్తు వార్త బ్రేకింగ్ న్యూసేం కాదన్నారు. నిన్న పవన్ చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్లారా.. లేక మరోదాని కోసం వెళ్లారా అని వనిత ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ఇన్నిరోజులు ఒకరికొకరు ప్రయాణం సాగించారని.. ఇదేమి కొత్త కాదన్నారు. పవన్ చాలా సులభంగా అబద్ధాలు చెబుతున్నారని.. వారాహి యాత్ర కూడా చంద్రబాబు చెబితేనే చేస్తున్నారని, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని హోంమంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై పవన్ గతంలో నీచంగా మాట్లాడారని వనిత దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఎవరెవరు వున్నారనే దానిపై విచారణ జరుగుతోందని.. టీడీపీ నాయకులు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని హోంమంత్రి ఫైర్ అయ్యారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios