Asianet News TeluguAsianet News Telugu

బాబు విశాఖ టూర్‌పై హోం మంత్రి సుచరిత సంచలనం: అనుమతి కోరితే ఆధారాలు చూపాలి

 విశాఖపట్టణంలో ఎల్జీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాస్తే దానికి సంబంధించిన ఆధారాలను చూపాలని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత కోరారు.ఈ పర్యటనకు సంబంధించి ఇంత వరకు చంద్రబాబు ఇంతవరకు అనుమతి తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
 

Ap home minister Sucharitha sensational comments on visakhapatnam tour
Author
Amaravathi, First Published May 24, 2020, 5:30 PM IST

అమరావతి: విశాఖపట్టణంలో ఎల్జీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాస్తే దానికి సంబంధించిన ఆధారాలను చూపాలని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత కోరారు.ఈ పర్యటనకు సంబంధించి ఇంత వరకు చంద్రబాబు చేసిన ధరఖాస్తు ఇంతవరకు తమకు అందలేదన్నారు మంత్రి.

ఆదివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు  రావడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు మంత్రి. ఈ నెల 25వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విశాఖలో ఎల్జీ బాధితులను పరామర్శించడానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ, ఏపీ డీజీపీలకు లేఖ రాసినట్టుగా ప్రచారం సాగుతోంది.

also read:ఎట్టకేలకు ఏపీకి వెళ్లేందుకు అధికారుల అనుమతి కోరిన చంద్రబాబు, ఎందుకంటే...

తెలంగాణ డీజీపీ ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అనుమతి కోసం అప్లై చేసుకొని ఉంటే అనుమతి వస్తుందన్నారు.

ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు విశాఖపట్టణం వెళ్లి ఎల్జీ పాలీమర్స్ బాధితులను పరామర్శించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీళ్లకు లేని అభ్యంతరాలు చంద్రబాబుకు ఎందుకొచ్చాయని ఆమె ప్రశ్నించారు.

ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద చల్లాలను చూస్తున్నారని ఆమె ప్రతిపక్షాలను విమర్శించారు.పోలీస్ శాఖలో వీక్లీ హఫ్ ను ప్రకటించి అమలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో 3 ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామన్నారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నామన్నారు. 

రాష్ట్రం అప్పులో ఊబిలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్లో తొంభై శాతం అమలు చేసిన ఘనత సిఎం జగన్ కే దక్కుతోందన్నారు. పాలనలో సంస్కరణలు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు 60 శాతం వరకు డబ్బులిచ్చి న్యాయం చేశామన్నారు.రైతు భరోసా పెంచి రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటునట్టు చెప్పారు. 

గతంలో చాలా కేసుల్లో సిబిఐ విచారణ వద్దని చంద్రబాబే చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఇప్పుడు ప్రతి కేసులో సిబిఐ విచారణ కోరడాన్ని ఆమె తప్పుబట్టారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios