Asianet News TeluguAsianet News Telugu

హోమ్ మంత్రి సుచరితకు అస్వస్థత, హుటాహుటిన ఇంటికి...

ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి  సుచరిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దానితో ఆమె నేటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

AP Home Minister Sucharita Falls Sick,  Today's Programmes Cancelled
Author
Amaravathi, First Published Jul 8, 2020, 5:46 PM IST

ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి  సుచరిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దానితో ఆమె నేటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటుండగా ఒంట్లో నలతగా అనిపించడంతో... ఆమె నేటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలియవస్తుంది. ఆమె ఈరోజు విశ్రాంతి తీసుకోనున్నారు. 

రేపు యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియవస్తుంది. ఆమె ఆరోగ్యాంగానే ఉన్నారని, కేవలం స్వల్ప అస్వస్థత అంతే అని, పెద్దగా కంగారు పడాల్సింది ఏమి లేదని అమ్మే సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

ఇకపోతే... దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం నాడు ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ వైఎస్ఆర్ 71వ జయంతి. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్, కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు.

 "నాలో.. నాతో వైఎస్సార్‌" అనే పుస్తకాన్ని వైఎస్ విజయమ్మ రాశారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత తనలో కలిగిన భావోద్వేగాల సమాహారమే నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో పొందుపర్చారు. వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకమని పలువురు అభిప్రాయపడ్డారు.

 ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్నారు.

ఇడుపులపాయలో నిర్వహిస్తున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఎమ్మెల్యేలను సైతం థర్మల్ స్కానింగ్‌ చేసిన తర్వాత జయంతి కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరైన మీడియా సిబ్బంది, ఎమ్మెల్యేలకు కలెక్టర్ హరికిరణ్ కోవిడ్ పరీక్షలు చేయించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో  పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios