వైసీపీ, బీజేపీలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఏపీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు. ఇటీవల కోటయ్య అనే రైతు మృతి చెందగా.. వైసీపీ, బీజేపీలు ప్రభుత్వంపై ఆరోపణలు  చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై చినరాజప్ప స్పందించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని చెప్పారు. రైతు కోటయ్య ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటి పోలీసులపై వారే చంపారని నిందలు వేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. 

టికెట్లు రానివారే పార్టీ వీడుతున్నారని ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చకున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి స్థానంలో మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.