పార్టీకి వీరవిధేయుడుగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సోదరుడు ఝలక్ ఇచ్చారు. చినరాజప్ప సోదరుడు లక్ష్మణ్ మూర్తి జనసేన పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
అమలాపురం: ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేర్గాంచిన చినరాజప్ప ఓ వెలుగువెలుగొందుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

పార్టీకి వీరవిధేయుడుగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సోదరుడు ఝలక్ ఇచ్చారు. చినరాజప్ప సోదరుడు లక్ష్మణ్ మూర్తి జనసేన పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
శనివారం ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లిజనసేన ప్రచార కార్యక్రమంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. అంతేకాదు కాపు సామాజకిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని సూచించారు కూడా. సోదరుడు ఝలక్ పై చినరాజప్ప ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.