అమరావతి: ఆవ భూములపై దాఖలైన పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఇప్పటికీ ఈ పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయకపోతే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిది హైకోర్టు. 

రాజమండ్రి రూరల్ కోరుకొండ మండలంలో పేదలు ఇళ్ల నిర్మాణానికి 585 ఎకరాలు ఆవ భూములు కొనుగోలు చేసిన వైసిపి ప్రభుత్వం.. అయితే ఎకరా రూ.7 లక్షల విలువైన భూమికి రూ.45 లక్షలు చెల్లించి అవినీతికి పాల్పడ్డారంటూ హైకోర్టులో  పిటిషనర్ దాఖలయ్యింది. భూములు కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయంటూ దాఖలైన ఈ పిటిషన్ పై విచారణ జరుపుతూ ప్రభుత్వంపై  అసహనం వ్యక్తం చేసింది అత్యున్నత ధర్మాసనం. 

read more   పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడుతోంది: జగన్

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 600 ఎకరాల కొనుగోలు చేసింది. అయితే ఈ భూముల కోనుగోలు వ్యవహానంలో గోల్ మాల్ చేసిందని... మార్కెట్ ధర కంటే అధికరేటుకు ఈ భూమలను కొనుగోలు చేసిందంటూ స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు.  

ఎకరా 7 లక్షల విలువైన భూమికి 6 రెట్లు పరిహారం పెంచి 45 లక్షలు చెల్లించిందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలాంటి చోట్ల పట్టాల పంపిణీ సరికాదని... రైతులకు డబ్బుల చెల్లింపులు కూడా ఆపాలని పిటిషనర్ కోరారు. దీనిపై కౌంటర్ దాఖలుకు అనుమతిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది.