Asianet News TeluguAsianet News Telugu

ప్లాంట్‌లో వస్తువుల విక్రయం:ఎల్జీ పాలిమర్స్‌కు హైకోర్టులో ఊరట

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కంపెనీలో సామగ్రి, యంత్రాల విక్రయానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారించింది

ap high court Verdict on lg polymers case ksp
Author
Amaravathi, First Published Apr 6, 2021, 4:59 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కంపెనీలో సామగ్రి, యంత్రాల విక్రయానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారించింది.

ఈ క్రమంలో కంపెనీలో సామగ్రి అమ్మకానికి ధర్మాసనం అనుమతించింది. యంత్రాలు అమ్మితే వచ్చిన మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద డబ్బును జమ చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కంపెనీలో ఉండిపోయిన రా మెటీరియల్ అమ్ముకోవాలని అందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ కోరింది. ప్రమాదం జరిగిన నాటి నుండే కంపెనీ మూత పడిందని కంపెనీ ప్రతినిధులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే కంపెనీ మూత పడిన నాటి నుండి అందులో విలువైన రా మెటీరియల్ ఉండిపోయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ రా మెటీరియల్ అమ్మకానికి అనుమతులు ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ కోరింది. వారు కోరిన దానికి ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది.

ఆ మెటీరియల్ చాలా ప్రమాదకరం అని పేర్కొన్న ప్రభుత్వం, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ సర్కార్ పేర్కొంది. దీంతో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

కొద్దిరోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీలో ఉండిపోయిన రా మెటీరియల్ అమ్ముకోవాలని అందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ న్యాయస్థానాన్ని కోరింది. ప్రమాదం జరిగిన నాటి నుండే కంపెనీ మూత పడిందని కంపెనీ ప్రతినిధులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే కంపెనీ మూత పడిన నాటి నుండి అందులో విలువైన రా మెటీరియల్ ఉండిపోయిందని తెలిపారు. ఆ రా మెటీరియల్ అమ్మకానికి అనుమతులు ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ న్యాయస్థానాన్ని కోరింది.

ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. ఆ మెటీరియల్ చాలా ప్రమాదకరం అని పేర్కొన్న ప్రభుత్వం, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి తెలియజేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది 

Follow Us:
Download App:
  • android
  • ios