Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఒకేసారి 62 మంది జడ్జీల బదిలీ.. న్యాయశాఖలో చర్చనీయాంశం

ఆంధ్రప్రదేశ్‌లో 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారంతా ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్థానాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించింది
 

ap high court transfers 62 junior judges ksp
Author
Amaravathi, First Published Jul 24, 2021, 6:25 PM IST

ఏపీలో భారీగా జడ్జిల బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం. బదిలీ అయిన వారంతా ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్థానాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈలోగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మూడు రోజుల క్రితమే 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55 మంది జడ్జిలను, బదిలీల ద్వారా 13 మందిని నియమించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios