అమరావతి: అమరరాజా కంపెనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను  ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పరిశ్రమను మూసివేయాలని  పీసీబీ ఆదేశాలు చేసింది. ఈ ఆదేశాలను అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ ఏడాది జూన్ 17 లోపుగా పీసీబీ సూచనలను  అమలు చేయాలని  హైకోర్టు కంపెనీకి  సూచించింది. విద్యుత్ ను పునరుద్దరించాలని కూడ కోరింది.

also read:నోటీసులకు చెల్లు.. ఇక యాక్షనే: అమరరాజాకు పవర్ కట్.. విద్యుత్ సంస్థలకు పీసీబీ ఆదేశం

మళ్లీ రిపోర్టు ఫైల్ చేయాలని కూడ  హైకోర్టు పీసీబీని ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు. పీసీబీ నిబంధలను ఉల్లంఘించిందనే  కారణంగా  చిత్తూరు జిల్లాలోని అమరరాజా కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ పీసీబీ ఈ నెల 1 వ తేదీన కంపెనీని ఆదేశించింది. అదే రోజున ఈ కంపెనీనకి విద్యుత్ సరఫరా ను నిలిపివేయాలని పీసీబీ విద్యుత్ శాఖ అధికారులకు లేఖలు రాసింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కరకంబాడీ, నూనెగుండ్లపల్లి వద్ద తయారీ యూనిట్లుఉన్నాయి.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన నేతల వ్యాపారాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. అంతేకాదు ముఖ్య నేతలపై కూడ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.