వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని రెండు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని రెండు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గణపవరం, పసుమర్రు గ్రామాలను చిలకలూరిపేటలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రవితేజ, పూర్ణచంద్రరావు అనే ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గణపవరం, పసుమర్రును నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై గురువారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సర్కార్ ఆదేశాలపై స్టే విధించింది.