కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయితీ సచివాలయ భవన నిర్మాణం విషయంలో సెక్రటరీ సర్పంచ్ కు నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ నోటీసులను నిలిపివేసింది.
అమరావతి: కర్నూలు జిల్లా జి.సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది. భవన నిర్మాణాన్ని ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవన నిర్మాణంపై సర్పంచ్ నాగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. గ్రామంలో నిర్మించాలని అడిగినా ఊరికి దూరంగా సచివాలయం కట్టడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌కు రూ.9 లక్షలు చెల్లించాలని సర్పంచ్‌కి పంచాయతీ కార్యదర్శి నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి సర్పంచ్‌కి నోటీసులు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులను నిలిపివేసింది. సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో అధికార పార్టీ సభ్యులు వేధిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
