ఏపీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష, జరిమానా.. హైకోర్టు తీర్పు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు అమలు చేయనందుకు శిక్ష విధిస్తున్నట్టుగా తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు అమలు చేయనందుకు శిక్ష విధిస్తున్నట్టుగా తెలిపింది. హైకోర్టు జైలు శిక్ష విధించినవారిలో ఐఏఎస్ అధికారి రాజశేఖర్, ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ ఉన్నారు. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో.. నెల రోజుల జైలు శిక్షతో పాటు, రూ. 2 వేలు జరిమానా విధించింది. వారిద్దరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
అయితే ఇద్దరు అధికారులు క్షమాపణ చెప్పడంతో హైకోర్టు తీర్పును సవరించింది. సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశించింది. ఇక, రాజశేఖర్ గతంలో పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రామకృష్ణ గతంలో ఇంటర్ బోర్డు కమిషనర్‌గా పనిచేయగా.. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్నారు.