కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్ కు ఊరట లభించింది. ఆయనపై జారీ చేసిన వారెంట్ ను హైకోర్టు రీకాల్ చేసింది. 

విజయవాడ: తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కు ఇటీవల హైకోర్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా నిన్న(మంగళవారం) హైకోర్టుకు హాజరయ్యారు మాజీ కలెక్టర్ ఇంతియాజ్. సమాచార లోపంతోనే గతంలో కోర్టుకు హాజరుకాలేకపోయానని... దయచేసి వారెంట్ ను రీకాల్ చేయాలని కోర్టును కోరారు ఇంతియాజ్ తరపు న్యాయవాది. దీంతో గతంలో ఇంతియాజ్ పై జారీచేసిన వారెంట్‌ను రీకాల్ చేసింది హైకోర్టు.