నిమ్మగడ్డకు హైకోర్టు షాక్: మునిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్ల దాఖలు ఆదేశాల కొట్టివేత

మున్సిపల్ ఎన్నికల్లో  రీ నామినేషన్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.

AP high court quashes orders of re nominations orders of SEC in municipalities lns

అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో  రీ నామినేషన్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.

రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో బెదిరింపులు, దౌర్జన్యాలతో విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరింపేలా అధికార పార్టీ నేతలు చేశారని విపక్ష పార్టీల నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈ రకమైన ఆరోపణలు వచ్చిన చోట మళ్లీ నామినేషన్లు దాఖలుకు ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈ మేరకు ఇటీవలనే ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది.

also read:మున్నిపల్ ఎన్నికల్లో నామినేషన్ల విత్‌డ్రా: నిమ్మగడ్డ కీలక ఆదేశాలు

ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అంతేకాదు వాలంటీర్ల విషయంలో కూడ ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను వినియోగించుకోవద్దని కూడ కోరింది. వారి ఫోన్లను కూడ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఫోన్లను డిపాజిట్ చేయాలని ఆదేశాలపై దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణ చేసింది.ఫోన్ల స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కొట్టేసింది.

 

తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్లలోని 4 వార్డులకు రీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది. ఈ ఆదేశాలను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios