జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్: ఆన్‌లైన్‌లో ఇంటర్ ఆడ్మిషన్ల నోటిఫికేషన్ కొట్టివేత
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది., ఆన్‌లైన్ ఇంటర్ ఆడ్మిషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడ ఆడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించింది.
అమరావతి: ఆన్‌లైన్‌లో ఇంటర్ ఆడ్మిషన్ల నిర్వహణపై ఏపీ ప్రభుత్వ నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి గత ఏడాది మాదిరిగానే ఆడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వచ్చే విద్యాసంవత్సరానికి అందరి అభిప్రాయాలను తీసుకొని ఆన్‌లైన్‌లో ఆడ్మిషన్లను నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఆన్‌లైన్ లో ఆడ్మిషన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జాదీ చేసింది.
ఈ నెల 13 నండి 23 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇంటర్ లో ఆడ్మిషన్లను ఈ విద్యాసంవత్సరం ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ లో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే ఈ విధానాన్ని నిరసిస్తూ కొందరు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు
తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్ వివరాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. . దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీలు రూ.100 లుగా నిర్ణయించారు. ఇతరులకు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్, ఒకేషనల్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు కోరింది..