పెద్దిరెడ్డి ఇష్యూ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్
ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు బుధవారం నాడు అనుమతిని ఇచ్చింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు బుధవారం నాడు అనుమతిని ఇచ్చింది.స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంట్లోనే ఉండాలని ఈ నెల 6వ తేదీన ఏపీ ఎస్ఈసీ ఆదేశించింది.
also read:నిమ్మగడ్డకు షాక్: మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఈ ఆదేశాలను ఏపీ హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. దీంతో ఎస్ఈసీ ఆదేశాలను ఏపీ హైకోర్టు ఈ నెల 7వ తేదీన కొట్టేసింది. అయితే మీడియాతో మాట్లాడే విషయంలో ఎస్ఈసీ ఆదేశాలను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎస్ఈసీ ఆదేశాలనను సమర్ధించిన సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి ఆదేశాలపై డివిజన్ బెంచ్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ విషయమై బుధవారంనాడు డివిజన్ బెంచ్ విచారణ నిర్వహించింది. సింగిల్ జడ్జి ఆవేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. షరతులతో మీడియాతో మాట్లాడేందుకు మంత్రికి డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ఎస్ఈసీ, కమిషనర్ లక్ష్యంగా మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది.
ఇతర విషయాలపై మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడేందుకు అనుమతిని ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతోంది. ఎస్ఈసీ వ్యవహరశైలిపై కొందరు మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
నిమ్మగడ్డ తీరును నిరసిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.