వైసీపీకి నిరాశ:దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం, వైసీపీ ఎంపీటీసీలు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. వారం రోజుల్లో టీడీపీ ఎంపీటీసీకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

AP High court orders  to give caste certificate to tdp MPTC member jabin within seven days

అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై  విధించిన స్టే ను ఎత్తివేయాలని వైసీపీ ఎంపీటీసీలు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.

గుంటూరు జిల్లాలోని duggiral mpp ఎంపిక నిర్వహణపై టీడీపీ ఏపీ హైకోర్టును  ఆశ్రయించింది. దీంతో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ స్టేను ఎత్తివేయాలని శుక్రవారం నాడు వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

also read:దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ: హైకోర్టు స్టే, ఉత్తర్వులు అందలేదన్న అధికారులు

ఎంపీపీ ఎన్నికపై స్టే ఎత్తివేయడం కుదరదని స్పష్టం చేసింది. అయితే కుల ధృవీకరణ అంశం తేలాలంటే రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రకటించారు. అయితే అంత సమయం ఎందుకని హైకోర్టు ధర్మాసనం అడిగింది. వారం రోజుల్లోనే  టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి షేక్ జబీన్ కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.ఎంపీపీ ఎన్నికపై  సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సమర్ధించింది.

దుగ్గిరాల మండలంలో టీడీపీ 9 ఎంపీటీసీలను, ycp 8 ఎంపీటీసీలు, jana sena
 1 స్థానాన్ని కైవసం చేసుకొంది.ఈ ఎంపీపీ పదవిని బీసీలకు రిజర్వ్ చేశారు. టీడీపీ నుండి విజయం సాధించిన shaik jabin కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ఆలస్యం చేశారని  ఆ పార్టీ ఆరోపణలు చేసింది.

ఇప్పటికే రెండు దఫాలు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ కూడ ఎంపీపీ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది.హైకోర్టు స్టే ఎత్తివేయలని వైసీపీ ఎంపీటీసీలు, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేయడంతో స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది.



 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios