Asianet News TeluguAsianet News Telugu

కలెక్టర్ నివేదిక సమర్పించాలి: రుయాలో కరోనా రోగుల మృతిపై ఏపీ హైకోర్టు

ఈ ఏడాది మే 10వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రిలో  ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా 11 మంది రోగులు మరణించారు. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల సమయం కోరింది ఏపీ సర్కార్.  

AP High court orders to file counter in ruia hospital incident lns
Author
Guntakal, First Published Jul 13, 2021, 4:18 PM IST

తిరుపతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగుల మరణంపై కౌంటర్ దాఖలు చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కౌంటర్ దాఖలుకు మూడు వారాల సమయం ఇవ్వాలని  ప్రభుత్వం హైకోర్టును కోరింది.తిరుపతి రుయాలో కరోనా రోగుల మరణంపై టీడీపీ నేత మోహన్ దాఖలు చేసిన 'పిల్‌'పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. రుయా ఆసుపత్రిలో కరోనా రోగుల మృతిపై  కలెక్టర్ ను సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు.  ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్  సమయానికి రాలేదని  కలెక్టర్ నివేదికలో ప్రభుత్వానికి వివరించారు. 

also read:తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగులకు అందని ఆక్సిజన్ : 11 మంది రోగుల మృతి

ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీ  నిర్లక్ష్యం కారణంగానే రుయాకు ఆక్సిజన్  సరఫరా కాలేదని కలెక్టర్  నివేదిక తెలుపుతోందని  పిటిషనర్ చెప్పారు.  ఇందుకు బాధ్యులను చేస్తూ ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ హైకోర్టును కోరారు.ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  

ఈ ఏడాది మే 10వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రిలో  ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మరణించారు. ఆక్సిజన్ సమయానికి అందని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని  రోగుల బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios