అయ్యన్నకు రిమాండ్ తిరస్కరణఫై హైకోర్టులో సవాల్: కౌంటర్ దాఖలుకి ప్రతివాదులకి ఆదేశం
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై విశాఖపట్టణం కోర్టు రిమాండ్ ను తిరస్కరించడంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు ఏపీ హైకోర్టు ఇవాళ నోటీసులు పంపింది.
అమరావతి:మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై విశాఖపట్టణం కోర్టు రిమాండ్ ను తిరస్కరించడంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై ప్రతివాదులకు హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 10 వతేదీకి వాయిదా వేసింది.
ఫోర్జరీ ఎన్ఓసీని సృష్టించారనే కేసులో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు గురువారంనాడు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అయ్యన్నపాత్రుడిపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని విశాఖపట్టణం కోర్టుతెలిపింది. రిమాండ్ ను తిరస్కరించింది.41ఎ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది హైకోర్టు. ఆరోపణలు ఎదుర్కొంటున్నఅయ్యన్న పాత్రుడికి 467 సెక్షన్ వర్తించనుందని ప్రభుత్వన్యాయవాది చెప్పారు.ఁఈ విషయమై కౌంటర్లు దాఖలు చేయాలని కూడాప్రతివాదులనుహైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
తనపై సీఐడీ దాఖలు చేసినఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ అయ్యన్నపాత్రుడు గురువారంనాడు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఇవాళ ఉదయం పదిన్నర వరకు కేసు డైరీని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఇవాళ ఉదయం పదిన్నర గంటల వరకు కేసు డైరీ కోర్టకు అందలేదు. ఇవాళ మధ్యాహ్నం వరకు డైరీని అధికారులు తీసుకువస్తారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు..దీంతో ఈ కేసు విచారణను ఇవాళ మధ్యాహ్నం విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
alsoread:అయ్యన్నపాత్రుడికి ఊరట.. కుమారుడితో సహా బెయిల్, న్యాయం గెలిచిందన్న చంద్రబాబు
తన ఇంటి గోడ కూల్చివేత అంశానికి సంబంధించి ఫోర్జరీ ఎన్ఓసీని సమర్పించారనే కేసులో నిన్న ఉదయాన్ని అయ్యన్నపాత్రుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అయ్యన్నపాత్రుడు ఏ1, ఆయన కొడుకు విజయ్ ఏ2 గా,మరో కొడుకు రాజేష్ ఏ3గా ఉన్నారు.